రేణిగుంట అల్లిమెట్ట గ్రామంలో కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్, 18 బైకులు సీజ్ చేసిన పోలీసులు
రేణిగుంట: 18 బైకులు సీజ్ రేణిగుంట మండలం అల్లిమెట్ట గ్రామంలో ఆదివారం ఉదయాన్నే పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్ పత్రాలు లేని 18 బైకులను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. రేణిగుంట సీఐ జయచంద్ర మాట్లాడుతూ.. గ్రామాల్లో అపరిచితులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు.