వనపర్తి: జీవితమే కాదు..దేహము కూడా ప్రజాసేవకే అంకితమిచ్చిన కామ్రేడ్ పుట్ట వరలక్ష్మి
సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పుట్ట ఆంజనేయులు సతీమణి పుట్ట వరలక్ష్మి అకాల మరణం పార్టీకి,తమ కుటుంబ సభ్యులకు తీరని లోటని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి అన్నారు. వరలక్ష్మీ మృతదేహానికి సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ రాష్ట్ర నాయకత్వం,పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాసంఘాల నేతలు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం శుక్రవార వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల అనాటమీ డిపట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ డా"డేవిడ్,ఆయన బృందానికి పార్థివ దేహాన్ని అప్పగించారు.