తాడిపత్రి: తాడిపత్రి అభివృద్ధి కోసం సోషల్ వర్క్ చేయడానికి మహిళలు ముందుకు రావాలి: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి
తాడిపత్రిని మరింతగా అభివృద్ధి చేయడానికి మహిళలు ముందుకు రావాలి. మహిళలు సోషల్ వర్క్ చేస్తేనే అభివృద్ధి చెందుతుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జే సీ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తాడిపత్రిలోని తన స్వగృహంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. హౌస్ వైఫ్ అంటే అడ్మినిస్ట్రేటరన్నారు. హౌస్ వైఫ్ ల అనుకుంటే తాడిపత్రి మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. త్వరలోనే మహిళలతో సమావేశం నిర్వహిస్తానన్నారు. సోషల్ వర్క్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లందరూ మీటింగ్కు హాజరు కావాలన్నారు.