రాజవొమ్మంగి మండల కేంద్రం నుంచి ప్రారంభమైన యుటిఎఫ్ నాయకుల జాతను అడ్డుకున్న పోలీసులు
రాజవొమ్మంగి నుంచి ప్రారంభమైన యుటిఎఫ్ నాయకుల జాత ను పోలీసులు అడ్డుకున్నారు. యుటిఎఫ్ రణబీరి కార్యక్రమంలో భాగంగా అన్ని మండలాల నాయకులు మంగళవారం రాజవొమ్మంగి నుంచి జాత ప్రారంభించారు. ర్యాలీగా అధిక సంఖ్యలో యుటిఎఫ్ నేతలు స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల నుంచి ప్రారంభమైన వెంటనే అల్లూరి కూడలి వద్ద సర్కిల్ ఇన్స్పెక్టర్ గౌరీ శంకర్, సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ సిబ్బందితో వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ యుటిఎఫ్ నాయకులతో మాట్లాడుతూ రణభేరికి అనుమతులు లేవంటూ యుటిఎఫ్ నేతలను అడ్డుకొని చెల్లా చెదురు చేశారు.