గోకవరం ఆంజనేయ స్వామి గుడి సెంటర్లో విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
గోకవరం ఆంజనేయస్వామి గుడి సెంటర్లో గురువారం విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈనెల 22న జరగనున్న దసరా ఉత్సవాల కోసం విద్యుత్ అలంకరణ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోల్ పై తీగలు వేస్తుండగా పెద్ద లైను విద్యుత్ తీగలు తగిలి యువకులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అయితే వారిని అక్కడ ఉన్న స్థానికులు తక్షణమే గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో గాయాలతో బయటపడ్డారు