మేడ్చల్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భవనం గేటు పడిపోవడంతో బాలుడు మృతి
దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదఘటన చోటు చేసుకుంది. బౌరంపేట లో నిర్మాణంలో ఉన్న భవనం ముందు గేటు ప్రమాదవశాత్తు పడిపోవడంతో ఆకాశ అనే బాలుడు మృతి చెందాడు. బాలుడు బుధవారం తాత, అమ్మమ్మ దగ్గరికి వచ్చాడు. ఆడుకుంటూ గేటు దగ్గరికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా అది పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయి చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.