సీఎం సహాయ నిధి అందజేసిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం, టీ కమ్మపల్లి గ్రామానికి చెందిన గుండపనేని ఇంద్రమ్మ గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.40,883/- మంజూరైన చెక్కును వారి స్వగృహం నందు *ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్* అందజేశారు. *అరవ శ్రీధర్ మాట్లాడుతూ* – “ప్రజల సమస్యల్లో అండగా నిలబడటమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎన్నో కుటుంబాలకు చేయూత అందిస్తున్నారు” అని అన్నారు.