శ్రీధన్వంతరి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జరపాలని మంత్రి సవితకు వినతి
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితను అనంతపురం జిల్లా నాయీ బ్రాహ్మణ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిసింది. శ్రీధన్వంతరి జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించాలని వినతి పత్రం సమర్పించింది. మంత్రి సవిత సానుకూలంగా స్పందించి, త్వరలో ప్రభుత్వం నుంచి తగిన జీవో విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.