వెలిగండ్లలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం అంగన్వాడీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... అంగన్వాడీ కార్యకర్తలు బాధ్యతతో పని చేయాలన్నారు. ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పౌష్టికాహారాన్ని చిన్నారులు, బాలింతలు, గర్భవతులకు క్రమం తప్పకుండా పంపిణీ చేయాలన్నారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు సకాలంలో కేంద్రాలను తెరవాలన్నారు.