అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని పామిడి మండల కేంద్రంలో జామియా మసీదు వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మసీదు ఆధిపత్యంపై జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.