తాడిపత్రి: పెద్దవడుగూరు మండలంలోని బీసీ కాలనీకి చెందిన సురేష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య
పెద్దవడుగూరు బీసీ కాలనీకి చెందిన సురేశ్ పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం గ్రామ శివారులో అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పామిడి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆత్మహత్య కు కారణాలు తెలియాల్సి ఉంది.