సంగారెడ్డి: బ్యాతోల్ నక్క వాగు శివారులో ఇసుక ఫిల్టర్ల పై దాడులు నిర్వహించిన విజిలెన్స్ అధికారులు
శుక్రవారం కంది మండలం బ్యాతోల్ నక్కవాగు శివారులో విజిలెన్స్ అధికారులు అక్రమంగా నిర్వహిస్తున్న ఇసుక ఫిల్టర్లపై దాడులు నిర్వహించి, వాటిని ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ట్రాక్టర్లను సీజ్ చేసి సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతి లేకుండా కృత్రిమంగా ఇసుకను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని తహసిల్దార్ రవికుమార్ హెచ్చరించారు.