వనపర్తి: చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవు: న్యాయమూర్తి శ్రీలత
వనపర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం వనపర్తిలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీలత హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యతో పాటు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే శిక్ష తప్పదని అన్నారు.