మంత్రాలయం: పెద్ద కడుబూరు మండలంలోని MSME పార్క్ నిర్మాణం సీఎం చేత వర్చువల్ గా ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి
పెద్ద కడుబూరు: మండలంలోని హెచ్ మురవణి రెవెన్యూ పరిధిలో హనుమాపురం గ్రామం నందు నలంద డిగ్రీ కాలేజ్ సమీపంలో MSME పార్క్ నిర్మాణాన్ని APIIC ఆధ్వర్యంలో మంగళవారం సీఎం చంద్రబాబు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తారని సోమవారం తహశీల్దార్ గీతా ప్రియదర్శిని తెలిపారు. కావున ఆయా శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని సూచించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు.