పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ అమరావతి మండలం పెద్ద మద్దూరు విజయవాడ వెళ్లే ప్రధాన రహదారి బ్రిడ్జి సమీపంలో వరదకు రోడ్డు కొట్టుకుపోయింది. గత రెండు మూడు రోజుల క్రితం ప్రవాహం రోడ్డుపైనే ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయని వాహనదారులు తెలిపారు. బరువైన వాహనాలు బ్రిడ్జిపై రాకపోకలు జరపరాదని స్థానిక పోలీసులు ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో బ్రిడ్జిపై బోర్డు లు ఏర్పాటు చేశారు. రోడ్డుకు మరమ్మత్తులు చేపట్టాలని నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జిని త్వరగతిన పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.