భూపాలపల్లి: జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో విశ్వకర్మ జయంతి వేడుకలు
బుధవారం ఐడిఓసి కార్యాలయంలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వ కర్మ జయంతి వేడుకలలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని చిత్రపటానికి రాష్ట్ర ట్రైకార్ ఛైర్మన్ డా బెల్లయ్య నాయక్, శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే, జ్యోతి ప్రజ్వలన చేసి,వివిధ కుల సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ట్రైకార్ చైర్మెన్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం రచించిన వేదాలలో విశ్వకర్మభగవానుని గురించి ప్రస్తావించబడిందని ఆనాటి కాలంలో విశ్వకర్మ మహర్షి మనకు కర్మయోగం, శిల్పకళ, నిర్మాణ శాస్త్రం, యాంత్రిక విజ్ఞానాని