జమ్మలమడుగు: కలసపాడు : అంకాలమ్మ గుడి సమీపంలో తెలుగు గంగ కాలవలో ఈతకు వెళ్లి యువకుడు మృతి..
కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కలసపాడు మండలం అంకాలమ్మ గుడి సమీపంలో తెలుగుగంగ కాలువలో మంగళవారం ఈతకు వెళ్లి యువకుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గిద్దలూరు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే 20 ఏళ్ల యువకుడు ఈతకు వెళ్లి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెల్సిన వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి కలసపాడు పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.