పూతలపట్టు: రాగిమానుపెంట రోడ్ పరిస్థితి వార్తపై చర్యలు చేపట్టిన బంగారుపాళ్యం తహసిల్దార్ బాబు రాజేంద్రప్రసాద్
బంగారుపాళ్యం – రాగిమానుపెంట రోడ్ పరిస్థితి రోడ్డు దుస్థితితో 20 గ్రామాల ప్రజలు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వాలు మారినా ఈ రోడ్డు పరిస్థితి మాత్రం మారలేదు. ఈ వార్త పబ్లిక్ యాప్ లో రావడంతో వెంటనే స్పందించి చర్యలు తీసుకుని రోడ్డు మరమ్మతులు చేపట్టారు. ఈ సందర్భంగా తాహసిల్దార్ బాబు ప్రసాద్ మాట్లాడుతూ రాగి మాన్పెంట రోడ్డు సంబంధించి రహదారి మరమత్తుల నిమిత్తం సిఫారసు చేయడం జరిగిందని దీంతో కొంతమంది ముందుకు వచ్చి రహదారి మరమత్తు పనులు బుధవారం ఉదయం నుండి ప్రారంభించడం జరిగిందని అన్నారు. త్వరలోనే రహదారి పనులు కూడా పూర్తిగా మరమత్తు చేయడం జరుగుతుందన్నార