యాడికి పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న వెంకట రమణ బుధవారం పదవీ విరమణ చేశారు. సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్స్టేషన్లో ఎస్ఐ వెంకటరమణ పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఎస్సై వెంకటరమణ దంపతులను శాలువా, పూలమాలతో సత్కరించారు.