భారీ వర్షాలు పడుతున్న వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ఉత్తమం:
డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య
భారీ వర్షాలు పడుతున్న వేళ ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ఉత్తమం అని పీలేరు మండలం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డిప్యూటీ హెచ్ఇఓ కొండయ్య సూచించారు. బుధవారం పీలేరు మండలం గాండ్లపల్లె గ్రామంలో "తుఫాను - జాగ్రత్తలు" అంశముపై ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి కాలుష్యం వల్ల డయేరియా,వాంతులు,కామెర్లు, టైఫాయిడ్, మొదలగు వ్యాధుల బారినపడకుండా ఇల్లు వాటి పరిసరాలు శుభ్రతతో పాటు దోమలు వృద్ధి చెందకుండా లార్వా నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రత్యేకించి అధిక ప్రమాదం ఉన్న గర్భిణి స్త్రీలు మరియు చిన్న పిల్లలు అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్సు సేవలు సద్వినియోగం చేసుకోవాలని, ఆరు