గంగాధర నెల్లూరు: వెదురుకుప్పం మండలం అల్లవారికండిగ గ్రామంలో స్థల వివాదం
వెదురుకుప్పం మండలం అల్లవారి కండిగలో ఓ మహిళకు సంబంధించిన స్థల వివాదం గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయికి చేరింది. మంగళవారం ఆమె వివరాల ప్రకారం.. 'నా స్థలాన్ని కొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై కలెక్టర్, ఎమ్మార్వోలకు ఫిర్యాదు చేశా. సరైన చర్యలు తీసుకోలేదు'. అని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.