నంద్యాల జిల్లా బేతంచెర్ల మండల పరిధిలోని అంబాపురం గ్రామానికి చెందిన ఓ యువతి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఏఎస్ఐ వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. అంబాపురం గ్రామానికి చెందిన నారాయణమ్మ కుమార్తె చింతమాను రాజేశ్వరిని (19) పనిచేయలేదని తల్లి మందలించడంతో ఈ నెల 22వ తేదీన పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడింది. కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మరణించింది.