మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయాన్ని జిల్లా ఇన్చార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ ప్రాంగణాన్ని పరిశీలించి, వివిధ విభాగాల నిర్వహణలకు అందుబాటులో ప్రదేశాలను సౌకర్యాలను సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. డిసిఆర్బి, స్పెషల్ బ్రాంచ్, ఐటి కోర్, డిపిఓ తదితర కీలక విభాగాల ఏర్పాట్ల పనులను స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ముందుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల యొక్క ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు.