ఆళ్లగడ్డ లోని కొత్త మసీదు వీధిలో కుక్కలు స్వైర విహారం: ఒకే రోజు 13 మంది ఆసుపత్రి పాలు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కొత్త మసీద్ వీధిలో కుక్కలు స్వైర విహారం చేసి, శనివారం ఒకే రోజు 13 మందిని గాయపరిచాయి. క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.