ప్రజల తరఫున పోరాటం చేస్తున్నం కాబట్టే ప్రజలకు న్యాయం జరుగుతుంది: యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్
Ongole Urban, Prakasam | Sep 15, 2025
ప్రజల తరఫున వైసిపి పోరాటం చేస్తుంది కాబట్టే ప్రజలకు అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందని ఒంగోలులో యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ అధికార ప్రతిపక్ష పార్టీలపై విమర్శలకుపించారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సోమవారం రాత్రి 7 గంటల సమయంలో వైరల్ గా మారాయి. ఇటీవల ఒంగోలులో పర్యటించిన ఎమ్మెల్యే చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఏ పార్టీ కూడా ప్రజల పక్షాన ఉండడం లేదని తమ పార్టీ పోరాటం చేయడం వల్లనే రైతులకు అందరికీ మేలు జరుగుతుందని ఎమ్మెల్యే చంద్రశేఖర్ అన్నారు.