కడప: ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహణ: జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్
Kadapa, YSR | Jul 5, 2025 ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్ - టీచర్స్ సమావేశాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్ లోని వీసీ హాల్లో మెగా పేరెంట్స్ - టీచర్స్ మీట్ సమావేశాలపై.... జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ...రాష్ట్ర వ్యాప్తంగా "మెగా పేరెంట్ టీచర్ మీట్" కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రధాన్యతతో నిర్వహించడం జరుగుతోందన్నారు.