బదిలీపై వెళుతున్న జిల్లా కలెక్టర్ కు ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా వివిధ శాఖల అధికారులు
Ongole Urban, Prakasam | Sep 14, 2025
ప్రకాశం జిల్లాలో కలెక్టరుగా పనిచేసి గుంటూరు జిల్లా కలెక్టరుగా బదిలీపై వెళుతున్న ఏ.తమీమ్ అన్సారియాకు జిల్లా అధికార యంత్రాంగం ఘన వీడ్కోలు పలికింది. ఆదివారం ఒంగోలు రిమ్స్ ఆడిటోరియంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఆమెతో కలిసి పనిచేసిన అనుభవాలను, తమకు దిశానిర్దేశం చేసిన సంగతులను ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు వెల్లడించారు. తమీమ్ అన్సారియా మాట్లాడుతూ అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగుల సహకారంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేశానని అన్నారు. గత ఏడాది జూన్ 27న ప్రకాశం జిల్లా కలెక్టరుగా బాధ్యతలు చేపట్టిన తాను జిల్లా అభివృద్ధిలో భాగమయ్యాను అన్నారు