పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా మట్టి ప్రమిదల వైపు ఆసక్తి చూపుతున్న ప్రజలు
శ్రీకాళహస్తి: మట్టి ప్రమిదల వైపు ఆసక్తి శ్రీకాళహస్తిలో మట్టి ప్రమిదలు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా అధికమంది మట్టి ప్రమిదలు వినియోగిస్తున్నారు. పలువురు సాంప్రదాయాలు కనుగుణంగా మట్టి ప్రమిదలు కొనుగోలు చేస్తున్నారు. ప్రమిదలు రూ.10 నుంచి రూ.50 వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. వివిధ ఆకృతుల్లో దీప ప్రమిదలు ఉండడంతో ప్రజలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.