తాడిపత్రి: ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో పదిమంది పై కేసు నమోదు చేసినట్లు తెలిపిన యాడికి సిఐ ఈరన్న
యాడికి మండలం వెంగన్నపల్లిలో బుధవారం రాత్రి మహిళ పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని రామేశ్వర్ రెడ్డి - విశ్వనాథ్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు గాయపడిన విషయం తెలిసిందే. విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామేశ్వర్ రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశామని సీఐ ఈరన్న తెలిపారు.