తిరుమలగిరిలపై వరుణుడి ప్రభావం చూపిస్తున్నాడు ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి తిరుమల తడిసి ముద్దయింది ఆలయం ఆడ వీధులన్నీ జలమయమయ్యాయి ఈ వర్షం కారణంగా స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చలిగాలు కూడా తోడవడంతో వృద్ధులు చిన్నపిల్లలు బాధలు మరింత పెరిగాయి మరోవైపు ఘాట్ రోడ్లో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని టిటిడి అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.