అదిలాబాద్ అర్బన్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సొంతగూటికి చేరిన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎట్టకేలకు సొంతగూటికి చేరారు. మంగళవారం హైదరాబాదులో టిపిసిసి అధ్యక్షులు మహేష్ కూమార్ గౌడ్ ఆద్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, టిపిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంజివ్ రెడ్డి లు తిరిగి కాంగ్రెస్ లో చేరారు దింతో వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లకు పార్టీలో చేరిన వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు