గూడూరు : తిన్నెలపూడి క్రాసింగ్ వద్ద రోడ్డు ప్రమాదం.. డివైడర్ ఢీకొని మినీ కంటైనర్ లారీ బోల్తా
Gudur, Tirupati | Oct 24, 2025 తిరుపతి జిల్లా కోట మండలం కోట క్రాస్ రోడ్ సమీపంలో తిన్నెలపూడి క్రాసింగ్ వద్ద శుక్రవారం రాత్రి వాకాడు వైపు నుండి విద్యానగర్ కి రొయ్యల లోడుతో వెళ్తున్న మినీ కంటైనర్ లారీ డివైడర్ ను ఢీకొని రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో వాహనదారులు ఎవరు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది