అవనిగడ్డ: మోపిదేవిలో స్వామి వారి ఆదాయం 96. 77 లక్షలు
మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. 96 రోజుల కాలువదికి 96. 77 లక్షల నగదు లభ్యమైనట్లు ఈవో దాసరి శ్రీరామ వరప్రసాదరావు తెలిపారు. ఒక కేజీ 560 గ్రాముల వెండి, 33. 300 మిల్లీగ్రాముల బంగారం, 37 అమెరికన్ డాలర్లు వచ్చినట్టు తెలిపారు. దేవాదాయ శాఖ తనిఖీ అధికారి శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఈ హుండీల లెక్కింపు నిర్వహించారు.