గన్నేరువరం: వివాదానికి కారణమైన గుండ్లపల్లి టు పొత్తూరు డబల్ రోడ్డు.. కాంగ్రెస్ బి ఆర్ స్ మధ్యల మాటల తూటాలు..
గన్నేరువరం పోస్టర్ వార్ స్థానిక సంస్థల ఎన్నికల ముందే మానకొండూర్ రాజకీయం హీటెక్కింది. టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల పరువు బజారున పడేలా పోస్టర్లు విడుదలయ్యాయి. నియోజకవర్గంలోని ఓ రోడ్డు విషయంలో ఇరుపార్టీల నాయకుల మధ్య మొదలైన గొడవ,ఇరువురి పరువు తీసేందుకు కారణమయ్యింది. రసమయి వర్సెస్ కవ్వంపల్లి మధ్య విడుదలైన పోస్టర్లపై పబ్లిక్ ఆప్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. మానకొండూర్ నియోజకవర్గంలోని గుండ్లపల్లి నుంచి పొత్తూర్ వరకు నిర్మించాల్సిన డబుల్ రోడ్డు విషయంలో రెండు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు విడుదలైనప్పటికీ పనులు పూర్తి కా