వెంకటాపుర్: మేడారంలో భక్తులకు ఏర్పాటు చేసిన మౌలిక వసతులను పరిశీలించిన మంత్రి సీతక్క
మేడారం జాతర ముగిసినప్పటికీ జాతరలో భక్తులు తాకిడి ఉంటుందని కావున కనీస మౌలిక వసతులు అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సీతక్క అన్నారు. నేడు ఆదివారం రోజున సాయంత్రం నాలుగు గంటలకు మేడారంలో క్యూలైన్లు, గద్దెల ప్రాంగణం కలియ తిరుగుతూ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి ఆరా తీశారు. ఈనెల 21న ప్రారంభమైన జాతర 24వ తేదీన నిన్న ముగిసిందని అయినప్పటికీ తిరుగువారం వరకు భక్తుల తాకిడి ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. కావున భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవార్లను దర్శించుకునే విధంగా ఏర్పాట్లను అలాగే ఉంచాలని ఆమె తెలిపారు.