ప్రొద్దుటూరు: పరిస్థితులు ఏవైనా ప్రజా క్షేమమే ధ్యేయం: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Oct 28, 2025 మెంథా తుఫాను తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో కడప జిల్లా ప్రొద్దుటూరులో గడచిన 24 గంటల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను దాటికి లోతట్టు ప్రాంతాలు, పలు వీధులు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని రిలయన్స్ పెట్రోల్ బంక్ వద్ద భారీగా వరద నీరు చేరి ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో ప్రొద్దుటూరు శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి మంగళవారం వర్షాన్ని సైతం లెక్కచేయక వర్షపునీటిని జెసిబి లతో తొలగించే ప్రయత్నం చేశారు. కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పనుల పర్యవేక్షణలో పూడ