నంద్యాలలోని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. అనుమతి పత్రాలు లేని రూ.1.34 లక్షల విలువైన బయో ఉత్పత్తుల విక్రయాలను నిలిపివేశారు. జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మితే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.