అసిఫాబాద్: వంకులం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం, ఒకరి మృతి, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
రెబ్బెన మండలంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం ఒకరు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రెబ్బెన మండలం వంకులం గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కాగజ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.