జిల్లాలో ఏడాదిలోపు అన్ని చెరువులను నీటితో నింపాలి - కలెక్టర్ శ్యాం ప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లాలో అన్ని చెరువులను ఏడాదిలోపు హంద్రీనీవా నీటితో నింపాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నీతిపారుదల శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెరువులను నీటితో నింపడమే గాక నీరు వృధా కాకుండా సంరక్షించాలన్నారు. నీటి సంరక్షణ సంఘాలను ఏర్పాటు చేయాలని చెరువులలో శాశ్వతంగా నీరు ఉండే విధంగా ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకోవాలన్నారు.