సూర్యాపేట: రహదారి భద్రత పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ
సూర్యాపేట జిల్లా: రహదారి భద్రత విషయంలో ఆటో డ్రైవర్లు ఇతర వాహనాదారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మంగళవారం హెచ్చరించారు. మంగళవారం సూర్యాపేటలోని ఓ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన మై ఆటో ఇస్ సేఫ్ నూతన డ్రైవింగ్ లైసెన్స్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పత్రాలను వెంట కలిగి ఉండాలని ఆయన సూచించారు .ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసులు తదితరులు పాల్గొన్నారు.