ప్రొద్దుటూరు: క్యూఆర్ కోడ్‌పై ఎక్సెజ్ శాఖ అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి
Proddatur, YSR | Oct 25, 2025 నకిలీ మద్యం నివారణకు ప్రభుత్వం తీసుకు వచ్చిన క్యూఆర్ కోడ్ విధానంపై ఎక్సైజ్ శాఖ అవగాహన కల్పించాలని ప్రొద్దుటూరు MLA వరదరాజుల రెడ్డి సూచించారు. ఆయన శనివారం ప్రొద్దుటూరులోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.మద్యం దుకాణాల్లో క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా పరిశీలించేలా కరపత్రాలు, మైకుల ద్వారా ప్రచారం నిర్వహించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అక్రమ మద్యం సరఫరాపై నిఘా పెట్టాలన్నారు.