గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని టిడిపి కార్యాలయంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న 74 మందికి రూ.32 లక్షలకు పైగా విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు అడిగిన వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ ను చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు.