నంద్యాల జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రం అహోబిలంలో గురువారం పారువేట ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎగువ అహోబిలం నుంచి జ్వాలా నరసింహస్వామి ఉత్సవ విగ్రహాన్ని పల్లకీలో దిగువ అహోబిలంకు ఊ రేగింపుగా తీసుకొచ్చారు. ఈ క్రమంలో చెంచులు సంప్రదాయ నృత్యాలతో స్వామికి స్వాగతం పలికారు. వేద పండితులు జ్వాలా నరసింహస్వామికి, ఆదివన్ శఠగోప మహాదేశికన్కు ఆలయ మర్యాదలు సమర్పించారు. ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు