మార్కాపురం: చెరువు కట్ట సమీపంలో చెత్తాచెదారం వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నారాయణరావు హెచ్చరిక
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని చెరువు కట్ట అనుకొని పశువుల పేడ చెత్తాచెదారం వేయడంతో వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాలతో సిబ్బంది పశువుల పేడ చెత్తాచెదారం తొలగించారు. ఇచ్చట పశువుల పేడ చెత్తాచెదారం వేయరాదని, వేసిన వారికి మున్సిపల్ చట్టం ప్రకారం 5000 రూపాయలు జరిమానా మరియు చట్ట ప్రకారం శిక్ష విధిస్తున్నట్లు హెచ్చరిక బోర్డును కమిషనర్ ఏర్పాటు చేశారు.