తల్లికి వందనం అరకొరగాని అందిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసిన జడ్పిటిసి నీలం భాస్కర్
Anantapur Urban, Anantapur | Sep 16, 2025
అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో తల్లికి వందనం అందరికీ వర్తింపచేయడం లేదంటూ ఆధారాలతో సహా బుక్కరాయసముద్రం జడ్పిటిసి సభ్యుడు నీలం భాస్కర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశానికి సంబంధించి విద్యా శాఖ ఇతర శాఖల తో సమీక్ష జరిపి సంబంధిత లబ్ధిదారులకు అందించే విధంగా చర్యలు చేపడతామని ఎంపీ అంబికా స్పష్టం చేశారు.