పుట్టపర్తిలో అభివృద్ధి పనుల పరిశీలించిన మాజీమంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి
శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలోని చిత్రావతి నది పరీవాహక ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం మధ్యాహ్నం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఓ గోల్డ్ కంపెనీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నిధులతో స్నానాల ఘాట్స్, చిల్డ్రన్ పార్క్‌లను స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. పనుల నిర్మాణాల స్థితిగతులను ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. చిత్రావతి నది శుభ్రంగా ఉండేటట్లు చూడాలని కోరారు.