పాడేరులో ఏ పి టి ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు నిరసన
ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిలుపునిచ్చిన నిరసన వారం లో భాగంగా పాడేరు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ సంఘం నేతలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంచేపట్టారు. తమకు రావాల్సిన నాలుగు పెండింగ్ డీఏ విడుదల, పన్నెండవ పీఆర్సీ, సిపిఎస్,జీపీఎస్ విధానాలు రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు వంటి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రం అందజేశారు.