రాయికల్: జేసీబీ సాయంతో గర్భిణి స్త్రీ వాగు దాటింపు. రాయికల్ మండలంలో ఘటన..!
Raikal, Jagtial | Aug 28, 2025 జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళకు మధ్యాహ్న సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో బంధవులు ఆ గర్భినిని భూపతిపూర్,రామోజీపేట మీదుగా రాయికల్ ఆసుపత్రికి తరలించాల్సి ఉంది. కానీ భారీ వర్షం కారణంగా రామోజీపేట మార్గమధ్యంలో ఉన్న లేవల్ వంతెన పై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో అక్కడి నుండి ఆమెను తరలించే పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. వెంటనే స్థానికులు జెసిబి లోని ముందు బకెట్ లో కూర్చోబెట్టి, వంతెన దాటించారు. అక్కడి నుండి అంబులెన్స్ లో రాయికల్ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం స్పందించి హైలెవల్ వంతెన ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.