పత్తికొండ: వెల్దుర్తి మండలం బైకు దొంగ అరెస్ట్ 4 బైకులు స్వాధీనం చేసుకున్న పోలీసులు
వెల్దుర్తి మండలం ఎల్. నగరం గ్రామ టీడీపీ కార్యకర్త పింజరి షేక్షావలి ద్విచక్రవాహనాల చోరీలకు పాల్పడుతూ గుంతకల్లు వద్ద పోలీసులకు చిక్కాడు. మంగళవారం, సెప్టెంబర్ 15న అనంతపురం జిల్లా బుగ్గ సంగాల వద్ద కసాపురం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బజాజ్ పల్సర్ మోడలకు చెందిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఎన్. ప్రవీణ్ కుమార్ తెలిపారు. షేక్షావలి గతంలో బుక్ కీపర్గా పని చేశాడు.