కాలంగినది వంతెనను పరిశీలించిన ఆర్డీవో కిరణ్మయి
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండల పరిధిలోని గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కాలంగినది ఉదృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో కాలంగి నది ప్రవహిస్తున్న తనయాలి బ్రిడ్జిను రెవెన్యూ డివిజన్ అధికారిణి కిరణ్మయి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. ఏ అవసరం వచ్చినా వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఆర్డిఓ వెంట దొరవారిసత్రం మండల తహసిల్దార్ పి శైలాకుమారి , దొరవారిసత్రం ఎస్సై అజయ్ కుమార్ పాల్గొన్నారు.